calender_icon.png 7 January, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూ ఇయర్ ప్రశాంతంగా జరగాలి

31-12-2024 01:38:16 AM

  • ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల, డిసెంబర్ 30 (విజయ క్రాంతి): ఆనందోత్సాహాల మధ్య నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకో వాలని జిల్లా ఎస్పీ అశోక్’కుమార్ సూచిం చారు. జగిత్యాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగిం చారు. వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలు ప్రశాంతమైన వాతవరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరుపున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగిందన్నారు.

వేడు కల పేరా ప్రజా జీవనానికి ఆటంకం కలిగిం చేలా ఎవరు ప్రవర్తించినా చర్యలు తీసుకోవ డం తప్పదన్నారు. డిసెంబర్ 31 రాత్రి నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్బంగా జిల్లా పోలీస్ యంత్రాంగం క్యూఆర్టి, స్పెషల్ పార్టీ, సిసిఎస్, స్పెషల్ బ్రాం, ఐటీ సెల్, షీ టీం తదితర బృందా లతో పటిష్ట బందోబస్త్, పెట్రోలింగ్ నిర్వ హించడం జరుగుతుందన్నారు.

పట్టణ, గ్రా మీణ ప్రాంతాల్లో కూడా డ్రంక్ అండ్ డ్రెవ్ తనీఖీలు నిర్వహిస్తామన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మన్నారు.  వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు రాత్రి 12:30గంటల వరకు పూర్తి కావాలని, తర్వాత కొనసాగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

టపాసులు, మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఇబ్బంది పెట్టకూడదని, డీజే లు వినియోగిస్తే సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం మత్తులో వాహనా లను ఇష్టానుసారంగా, వేగంగా నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేయడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

న్యూ ఇ యర్ వేడుకల్లో నిషేధిత డ్రగ్స్, గాంజా వంటి మత్తు పదార్థాలు విక్రయించినా, విని యోగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం దుకాణాలను నిర్ణీత సమయంలో మూసేయాలని, మైన ర్లకు మద్యం అమ్మకూడదని సూచించారు.

మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే, వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని, వారి వల్ల ఏదైనా ప్ర మాదం చోటు చేసుకుంటే వారి సంర క్షకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చ రించారు.

న్యూ ఇయర్ వేడుకలపై పోలీస్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందన్న విషయాన్ని ముఖ్యంగా యువత గుర్తుంచుకోవాల న్నారు. జగిత్యాల జిల్లా పరిధిలో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో  జరుపుకోవాలని ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు.