29-03-2025 11:50:08 PM
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి...
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): దేవుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు చేసే ఉపవాస దీక్షలు ఫలించాలని స్థానిక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంకషన్ హాల్ లో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అల్లా బోధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకలన్నారు. సర్వమతాలను సమానంగా చూసేదే బీఆర్ఎస్ పార్టీ అన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా, మజీద్ ఇమామ్, మోజాన్ లకు పారితోషకం అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.