calender_icon.png 25 December, 2024 | 12:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలపై అయ్యప్ప స్వామి కృప ఉండాలి

25-12-2024 12:00:00 AM

* అయ్యప్ప స్వామి పడిపూజలో రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

 మహదేవపూర్, డిసెంబర్  24 : రాష్ర్ట ప్రజలపై అయ్యప్ప స్వామి చల్లని కృప ఉండాలని, రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంథని నియోజక వర్గంలోని  భూపాలపల్లి జిల్లా మహాదేవ పూర్ మండల కేంద్రంలోని  అయ్యప్ప స్వా మి దేవాలయంలో మంగళవారం మంత్రి శ్రీధర్ బాబు అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొని, అభిషేకాలు నిర్వ హించారు. ముందుగా దేవాలయం వద్దకు వచ్చిన మంత్రికి గురు స్వామి పడకంటి రమేష్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి మంత్రిని అయ్యప్ప పడిపూజ వద్దకు తీసుకువెళ్లారు.

అనంతరం అయ్యప్ప స్వామి మూలవిరాట్‌కు పంచా మృతాలు, పండ్లతో అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లా డుతూ అయ్యప్ప స్వామి పడి పూజ మహో త్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని మంథని ప్రజలపై అయ్యప్ప స్వామి చల్లని కృప ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామి వారిని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో 363 నేషనల్ హైవే పై కాళేశ్వరం ఆర్చి గేటు రూ. 36 లక్షలతో నిర్మించుటకు భూమి పూజ చేశారు.

అయ్య ప్ప అయ్యప్ప నామస్మరణతో  నాగేంద్ర గిరి మారు మోగింది. కార్యక్రమంలో మండలం లోని అయ్యప్ప స్వాములు, రాష్ర్ట ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, మహా దేపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, ప్రాథమిక సహ కార సంఘం చైర్మన్ చల్ల తిరుపతయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్బర్ ఖాన్, మాజీ కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ వామన్‌రావు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విలాస్ రావు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కటకం అశోక్  కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.