కాటారంలో క్రిస్మస్ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు
మహదేవపూర్, డిసెంబర్ 24: ఏసుక్రీస్తు అనుగ్రహం ఎల్లప్పుడూ అందరిపై ఉండాల ని రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంత్రి నియోజకవర్గం లోని భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బిఎల్‌ఎన్ గార్డెన్ లో రాష్ర్ట ప్రభుత్వం నిర్వహించిన ఐదు మండలాల క్రిస్మస్ వేడుకలకు మంగళవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఏసు క్రీస్తు అను గ్రహం అందరిపై ఉండాలి, మానవవాళికి ప్రేమ, శాంతి మార్గం చూపిన మహనీయు డు ఏసుక్రీస్తు అని, అతడి అనుగ్రహం అందరిపైనా ఉంటుందని మంత్రి అన్నారు.
రాష్ర్ట ప్రభుత్వం ఈ క్రిస్మస్ వేడుకలు ఘనంగా కాటారం కేంద్రంగా నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు. క్రైస్తవ సోదరులు అడిగిన పలు హామీలను రాష్ర్ట ప్రభుత్వం నెరవేరుస్తుందని ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు ఈ ఐదు మండలాల పరిధిలో ఉన్న 95 మంది పాస్టర్లకు భూమి ఉన్నవారికి తప్పనిసరి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. క్రైస్తవ మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
క్రైస్తవ సోదరులు మంత్రి శ్రీధర్ బాబును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట ట్రేడ్ ప్రమోషన్ కార్పొ రేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మాయంక సింగ్, పాస్టర్ల సంఘం గౌరవాధ్యక్షుడు అబ్రహం, అధ్యక్షుడు డేవిడ్ మార్క్, ఉపాధ్యక్షుడు ఆదామ్, జనరల్ సెక్రటరీ జీవరత్నం, జైంట్ సెక్రెటరీ ప్రకాష్, కోశాధికారి బన్సీలాల్ తదితరుల పాస్టర్లు పాల్గొన్నారు.