calender_icon.png 2 April, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరికీ అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలి

31-03-2025 12:00:00 AM

ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ మార్చి 30 (విజయ క్రాంతి) : శ విశ్వావసు నామ సంవత్సర ఉగాది మనందరికి శుభాలను అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. 

ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణం లోని శిల్పారామం లో  నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రావణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో పంచాంగ శ్రవణ కర్త శ్రావణ్ కుమార్  పంచాంగ శ్రవణము నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్ నగర్ ప్రజలంతా    శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సుఖసంతో షాలతో ఉండాలని ప్రతి ఒక్కరికి వారి ఆశలు ఆకాంక్షలు నెరవేరాలని ఆశాభావం వ్యక్తం చేశారు.  మహబూబ్ నగర్ లో ఏ వేడుకలు అయినా, ఏ  పండుగలు రోజులైనా  భక్తి శ్రద్ధలతో సోదరభావంతో కలిసి మెలిసి ఘనంగా  నిర్వహించు కోవాలని సూచించారు.

శ్రీ విశ్వావసు నామ ఉగాది అందరికీ  విజయాలను, కీర్తిని అందించాలని,  అలాగే పదవ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు వ్రాసిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని,  నిరుద్యోగ యువతకు  ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలని ఆయన ఆకాంక్షించారు.  అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించిన 12 మంది ప్రముఖులకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఉగాది పచ్చడిని అతిథులతో కలిసి స్వీకరించారు. 

అనం తరం క్లాక్ టవర్ దగ్గర హమాలీల కోసం ఎమ్మెల్యే నిధులనుం చి ఏర్పాటుచేసిన  విశ్రాంత షెడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, టి పిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ఉపాధ్యక్షులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ,హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్ ,  బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.