calender_icon.png 15 March, 2025 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

15-03-2025 12:59:16 AM

ఎంపీ డీకే అరుణ 

మహబూబ్ నగర్ మార్చి 14 (విజయ క్రాంతి) : రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం అడ్డాకల్ మండల పరిధిలోని కొలువు తిరిన కందురు రామలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర  అధునాతన హంగులతో నిర్మించిన మోడల్ కమ్యూనిటీ హాల్ను ఎంపీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రూ. 7 లక్షల ఎంపీ నిధులలో మోడల్ మల్టి పర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఇదే తరహా  మోడల్ కమ్యూనిటీ హాల్స్ త్వరలో పార్లమెంటు అంతటా దశల వారీగా నిర్మిస్తామని తెలిపారు. భక్తులు ఈ కమ్యూనిటీ హాల్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, బిజెపి నాయకులు ఉన్నారు.