calender_icon.png 27 February, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలపై పరమశివుని ఆశీస్సులు ఉండాలి

27-02-2025 01:18:58 AM

  • నియోజకవర్గంలోని పలు శివాలయాలను సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు 
  • నేడు ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టును సందర్శిస్తాం

సిద్దిపేట, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి):  ప్రజలపై పరమశివుని ఆశీస్సులు ఉండాలని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు శివరాత్రి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఆయన శివున్ని ప్రార్థించినట్లు చెప్పారు. బుధవారం సిద్దిపేట నియోజకవర్గంలోని మిట్టపల్లి, వెంకటాపూర్, ఖాతా, సాలేంద్రి, పట్టణంలోని కోటిలింగాల దేవాలయాలలో జరిగిన శివరాత్రి ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. శివపార్వతుల కల్యాణోత్సవాన్ని ఆసక్తిగా తిలకించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సిద్దిపేట పట్టణంలో వెంకటేశ్వర ఆలయం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం రంగనాయక సాగర్ వద్ద రంగనాయక పల్లి వైపు వెళ్లే కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి రైతులు సాగు చేసిన పంటలు అధిక ధాన్యాన్ని కలిగించాలని భగవంతుని ప్రార్థించినట్లు చెప్పారు.   బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టును సందర్శిస్తామని వెల్లడించారు. బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హరీష్ రావు వెంట ఉన్నారు.