calender_icon.png 18 April, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

11-04-2025 07:17:30 PM

శ్రీ మణికంఠ భక్త బృందం ఆధ్యాత్మిక సేవలు అభినందనీయం..

అన్నదానాలు పుణ్యకార్యాలు... మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు

శ్రీ మణికంఠ భక్త బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఆలయంలో  ఘనంగా పూజలు... అన్నదానం

కోదాడ: అయ్యప్ప స్వామి ఆశీస్సులు కోదాడ నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని కోదాడ మాజీ సర్పంచ్ బాబు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా శ్రీ మణికంఠ భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అన్నదానాలు పుణ్యకార్యాలని ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి ఆకలి తీర్చడం ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది అన్నారు.

అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీ మణికంఠ భక్త బృందం చేస్తున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం అన్నివేళలా ఉంటుందన్నారు. అనంతరం అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బతినేని హనుమంతరావు దేవాలయ కార్యదర్శి చల్లా రామ్మూర్తి ఉపాధ్యక్షులు బోలిశెట్టి కృష్ణయ్య సహాయ కార్యదర్శి సురభి నరసయ్య మణికంఠ భక్త బృందం సభ్యులు రావెళ్ల కృష్ణారావు చౌదరి తూముల శివప్రసాద్ గురుస్వామి ఈదులాపురం శ్రీను గురు స్వామి తమ్మన వెంకట నాగ అవతారం గడ్డం శ్రీనివాస్ రెడ్డి గజ్జి సోమేశ్వరరావు ఓరుగంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాగా అన్నదానంలో 1200 మందికి పైగా భక్తులు అన్న ప్రసాదం స్వీకరించడం ఆనందం కలిగిందని భక్త బృందం ఆనంద ఉత్సవాలు వ్యక్తం చేసింది.