14-04-2025 01:04:21 AM
-మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్
మహబూబ్ నగర్ ఏప్రిల్ 13 (విజయ క్రాంతి) : దైవ అనుగ్రహం అందరి పై ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నారు. ఆదివారం పాలమూరు పట్టణంలోని వీరన్నపేట, డబుల్ బెడ్రూం వెలసిన శ్రీ కాశి విశ్వనాథ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎంతో ముందు చూపుతో సమాంతర అభివృద్ధి చేసుకుంటూ ముందు కు సాగుతున్నారు అని తెలిపారు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు ఉన్నారు.