calender_icon.png 14 March, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దైవానుగ్రహం అందరిపై ఉండాలి: ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

13-03-2025 12:08:06 AM

అడ్డాకల్ మార్చి 12 : దైవ అనుగ్రహం అందరి పై ఉండాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం అడ్డాకుల మండలం కందూర్ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం లో పార్వతి సమేత శ్రీరామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో సతి సమేతంగా దేవరకద్ర ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేయడంతో పాటు అ రామలింగేశ్వర ఆలయ పరిసర ప్రాంతాలలో మంచినీటి కుళాయిలను, సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వం మనదని స్పష్టం చేశారు. ఐక్యంగా ఉండి ప్రభుత్వానికి అండగా నిలబడదామని పేర్కొన్నారు. విడుతల వారీగా ప్రతి సమస్యకు పరిష్కరించుకుంటూ ముందుకు సాగుదామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.