24-02-2025 12:14:01 AM
మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి) : దైవ అనుగ్రహం అందరిలో ఉండాలని.. అప్పుడే ప్రతి ఒక్కరు సన్మార్గంలో ముందుకు నడుస్తారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని న్యూ మోతినగర్ లో శ్రీశ్ కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.