calender_icon.png 30 April, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడేను ఉత్సవంగా నిర్వహించాలి...

29-04-2025 07:46:12 PM

సిఐటియు కన్వీనర్ బండారు శరత్ బాబు...

కార్మిక అడ్డాల వద్ద మేడే కరపత్రాలను పంపిణీ చేసిన సిఐటియు...

భద్రాచలం (విజయక్రాంతి): కార్మికుల పండుగైన మేడే ను ఒక ఉత్సవంలా అన్ని కార్మిక వాడల్లో ఘనంగా నిర్వహించాలని, ఈ వేడుకలలో ప్రతి కార్మికుడు పాల్గొనాలని సిఐటియు భద్రాచలం పట్టణ కన్వీనర్ బండారు శరత్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం మే డే ఉత్సవాలను విజయవంతం చేయాలని కాంక్షిస్తూ మేడే కరపత్రాలను పట్టణంలోని కార్మిక కూడలిల వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండారు శరత్ బాబు మాట్లాడుతూ... కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టాక కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ కార్మిక హక్కులను కాల రాస్తున్నారని ఆరోపించారు.

ప్రస్తుత పాలకులు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు మేడేను ఒక వేదికగా ఉపయోగించుకోవాలన్నారు. వేలాదిమంది కార్మికులు తమ ప్రాణాలను బలిదానం చేసి సాధించుకున్న హక్కులకు సూచికగా ప్రపంచ కార్మికుల ఐక్యతను తెలియజేస్తూ ప్రపంచ కార్మికులారా ఏకంకండి అని నియమిస్తూ మేడే ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని కార్మిక అడ్డాల వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించి అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుండి కార్మిక ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఈ ప్రదర్శనలో అన్ని రంగాల కార్మికులు ఎర్ర చొక్కాలు ధరించి ప్రదర్శనలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎంబి నర్సారెడ్డి పట్టణ కోర్ కమిటీ సభ్యులు ఎర్రం శెట్టి వెంకట రామారావు పారిల్లి సంతోష్ కుమార్ కొలగాని రమేష్ అప్పారి రాము అజయ్ కుమార్ గుమ్మడి నాగరాజు జాకీర్ గజ్జల సూర్యరాజు తదితరులు పాల్గొని కార్మికులకు కరపత్రాలను పంపిణీ చేశారు.