26-04-2025 12:00:00 AM
ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మేడే పోస్టర్ ఆవిష్కరణ
ఎల్బీనగర్, ఏప్రిల్ 25 : కార్మిక సంఘాలు, కార్మికులు, ప్రజలు మేడే ను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కీసరి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. హయత్ నగర్ కుంట్లూర్ రోడ్డు లోని ఆటో స్టాండ్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం మేడే పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ.. మే 1న నిర్వహించే మే డేను కార్మిక వర్గం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
అనేక పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గితే భారతదేశంలో విచ్చలవిడిగా ధరలు పెంచి, ఆటో కార్మికులకు తీవ్ర నష్టం చేస్తున్నారని అన్నారు రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీమ్ తో ఆటోవాలా గిరాకి తగ్గిందని, అదేవిధంగా వోలా, ఉబర్, రాపిడో సంస్థలకు అనుమతి ఇవ్వడంతో ఆటో కార్మికుల జీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇస్తానన్న రూ. 12000 రాయితీని తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు కడారి రాములు, నక్క అశోక్, ఓరుగంటి రాజు గౌడ్, జగన్మోహన్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.