01-04-2025 02:38:35 AM
వానగుట్ట ఈద్గా వద్ద భారీ ఎత్తున ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు
ఈద్గాకు చేరుకొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ మార్చి 31 (విజయ క్రాంతి) : అల్లా దీవెనలతో అందరికీ శుభాలు కలగాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని వానగుట్ట దగ్‌ఈద్గా దగ్గర ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గా దగ్గరికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎఐసిసి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి, మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, టి పిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, వినోద్ కుమార్, మిజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రమశిక్షణ, ధార్మిక చింతన కలయికనే రంజాన్ మాసం విశిష్టత అని, మనిషిలోని చెడు భావాన్ని, అధర్మాన్ని , ద్వేషాలను రూపుమాపే గొప్ప పండగ రంజాన్ అని తెలిపారు. అల్లా చూపిన మార్గంలో నడవాలని అల్లా చల్లని దీవెనలు మనందరిపై ఉండాలన్నారు. రంజాన్ పండగ ఎంతో పవిత్రమైన పండగ అని మతసామరస్యానికి, సహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిథున్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, సిరాజ్ ఖాద్రీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.