calender_icon.png 4 April, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని నియోజక వర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

03-04-2025 11:30:16 AM

సుందిళ్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలో శ్రీనుబాబు

రామగిరి,(విజయక్రాంతి): మంథని నియోజక వర్గ(Manthani Assembly constituency) ప్రజలందరూ సుభిక్షంగా, కుటుంబ సభ్యులతో అందరూ సుఖసంతోషాలతో జీవించాలని రామగిరి మండలంలోని సుందిళ్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం(Sri Lakshmi Narasimha Swamy Temple)లో మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు(Duddilla Srinu Babu) ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొడ్డ  బాప్పన్న, సుందిళ్ల గ్రామ శాఖ అధ్యక్షులు జనగామ కృష్ణ, రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సుందిళ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.