ధన్వాడలో అమ్మవారి వ్రతంలో దుద్దిళ్ల శీను బాబు...
మహదేవపూర్ (విజయక్రాంతి): అనఘ దేవి అమ్మవారి ఆశీర్వాదాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు. మంథని నియోజకవర్గంలోని కాటారం మండలం ధన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో అనఘాదేవి వ్రతం గ్రామ ప్రజలు, ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ వ్రత కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని, అలాగే సకాలంలో వర్షాలు కురిసి రైతుల పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.