30-03-2025 05:34:51 PM
రూ. 50 లక్షల 50 వేల రూపాయలతో గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన..
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి..
బాన్సువాడ (విజయక్రాంతి): ప్రజలందరూ ఆనందమయంగా ఉండాలని అద్భుతమైన విజయాలు తెలుగు నూతన సంవత్సరంలో అందుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ గ్రామంలో తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో మాట్లాడారు. తెలుగు నూతన సంవత్సరాది "శ్రీ విశ్వావసు" నామ ఉగాది పండుగ వేడుకలను తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానము నందు శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన ఉగాది పండుగ వేడుక, పంచాంగ శ్రవణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలందరూ ఆనందమయంగా ఉండాలని, అద్భుతమైన విజయాలు అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, తెలుగు నూతన సంవత్సర "శ్రీ విశ్వావసు" నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, పోచారం సోదరుడు పోచారం శంబురెడ్డి, కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.