మందమర్రి (విజయక్రాంతి): పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు కవితల పోటీలో అత్యంత ప్రతిభ కనబరిచిన మట్టె రవీందర్ ను అరుదైన డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ లెజెండరీ అవార్డు వరించింది. అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని రవీంద్రభారతి మినీ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పురస్కారం అందుకున్నారు. అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కలాం 93వ, సర్ధార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవానికి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ సరోజనమ్మ, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి జిల్లా ఎస్పీ తేజావత్ రాందాస్, ప్రముఖ సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ పురస్కారాలను అందజేశారు.
ఇదిలా ఉండగా 'మహోన్నత శిఖరం' శీర్షికన మట్టె రవీందర్ రాసిన కవితకు ఈ పురస్కారం అందుకున్నారు. పాత్రికేయుడు రవీందర్ కు అవార్డు రావడం పట్ల పట్టణ ప్రజలు,సహచర పాత్రికేయులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక ఔత్సాహికులు దైవాజ్ఞ శర్మ, సీనియర్ నటీమణి జ్యోతి స్వరూప్, సినీ హీరో నరేన్ తేజ్, వంశీకృష్ణ, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు శివలీల, వాణి, లక్ష్మన్, పలువురు రచయితలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.