13-04-2025 01:18:19 PM
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం పట్టణం(Bhadrachalam town)లోని సీఎస్ఐ చర్చిలో ఆదివారం నాడు చర్చి నిర్వాహకులచే ఘనంగా మట్టల ఆదివారం పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. భక్తులు ఈత మట్టలు చేత పట్టుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో భక్తులు పాల్గొని ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ కేటి విజయ్ కుమార్ బైబిల్ లోని క్రీస్తు బోధనలను వినిపించారు. ఈ కార్యక్రమంలో సహాయ పాస్టర్ గడిదేసి సాల్మన్, ఫాస్ట్ రేట్ కార్యదర్శి కోశాధికారి కమిటీ సభ్యులు పాల్గొన్నారు