calender_icon.png 15 January, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంచర్‌లోకి నీరొస్తదని మత్తడి బ్లాస్ట్?

18-09-2024 03:51:09 AM

  1. చెన్నూర్ పట్టణంలోని శనిగకుంటలో కలకలం 
  2. పరిశీలించిన నీటిపారుదల శాఖ అధికారులు 
  3. పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు

మంచిర్యాల, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణం లోని శనిగకుంట చెరువు మత్తడి కాంక్రీట్ ని ర్మాణాన్ని బ్లాస్ట్ చేశారు. గుర్తుతెలియని వ్య క్తులు బ్లాస్టింగ్ మెటీరియల్ ఉపయోగించి సోమవారం రాత్రి పేల్చివేశారు. ఈ చెరువు చెన్నూర్ హైవేకు ఆనుకొని ఉండటంతోపా టు పక్కనే ఓ వెంచర్ సైతం ఉంది. మరోవైపు చెరువులోకి నీరు ఎక్కువవుతుండట ంతో వెంచర్‌లోకి నీరు వస్తుందనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మత్త డిని పేల్చడంతో చెరువు కింద ఉన్న 43 ఎకరాల ఆయకట్టు రైతులు, మత్స్యకారులకు తీ వ్రంగా నష్టం జరుగనుందని వాపోతున్నా రు. మత్తడి పేల్చివేత సమాచారం అందుకు న్న చెన్నూర్ డివిజన్ ఇరిగేషన్ ఈఈ విష్ణు నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి మ ంగళవారం ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీ ఐ రవీందర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.