calender_icon.png 20 April, 2025 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళారులను నమ్మి మోసపోవద్దన్న మట్టా దయానంద్

09-04-2025 07:04:33 PM

తల్లాడ (విజయక్రాంతి): మండల పరిధిలో బసవపురం గ్రామం, కుర్ణవెల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తుందని ప్రభుత్వం నిర్ణయించిన ధరకి రైతులందరూ వడ్లను అమ్ముకొని అధిక లాభం పొందాలని దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పడం జరిగింది. సొసైటీలో రైతులకు కావాల్సిన బస్తాలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బస్వాపురం, కుర్ణవెల్లి రైతు సోదరులు, సొసైటీ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు మరియు తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.