వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మట్కా’. ఈ చిత్రాన్ని కరుణకుమార్ దర్శకత్వంలో డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ కథానాయి కలు. జీవీ ప్రకాశ్‌కుమార్ కంపోజ్ చేసిన మ్యూజిక్ ఆల్బమ్ ఆదరణ పొందింది. సినిమా నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానున్న నేపథ్యంలో సంగీత దర్శకుడు జీవీ విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
“దీపావళికి వచ్చిన ‘అమరన్’, ‘లక్కీ భాస్కర్’లాగే ‘మట్కా’ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నా. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ స్క్రిప్ట్‌కి ఉంటుంది. తర్వాత డైరెక్టర్ గురించి ఆలోచిస్తా. కరుణకుమార్ డార్క్ ఫిలిం మేకింగ్ స్టయిల్ బ్రిలియంట్. డార్క్ జోనర్ చేయడంలో ఆయనదిట్ట. ‘మట్కా’ చాలా మంచి స్క్రిప్ట్. పిరియాడికల్ స్టోరీ కాబట్టి, మ్యూజిక్ ప్రేక్షకులను ఆ టైమ్స్‌లోకి తీసుకెళ్లాలి.
మోడరన్ సింథ్స్ వాడొద్దు. పిరియాడిక్ టోన్ తరహా మ్యూజిక్‌ను సృష్టించాలి. అలాంఇ రిస్ట్రిక్షన్స్ నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది. ‘మట్కా’లో -రెట్రో జోన్‌లో చేసిన ‘లేలే రాజా..’ పాట నాకు చాలా ఇష్టం. 80ల బ్యాక్‌డ్రాప్‌లో ‘బప్పిలహరి’ స్టుటైల్లో చేసిన ఆ సాంగ్ చేసినప్పుడు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది” అని చెప్పారు.