వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మట్కా’. కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లు. నవంబర్ 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కరుణ కుమార్ మంగళవారం విలేకరుల సమావేశమై చిత్ర విశేషాలను పంచుకున్నారు. “మట్కా’ కథకు ఆద్యం ఒక మ్యారేజ్ ఫంక్షన్‌లో పడింది.
మా వైఫ్ తరఫున బంధువుల్లో ఒకతను పంటర్‌గా పని చేశాడు. అప్పుడే మట్కా గేమ్ గురించి విన్నా. ఆ మాటల సందర్భంలో వైజాగ్‌లోనే నైట్ క్లబ్బు లు, క్యాబరీలు ఉండేవని తెలుసుకున్నా. ఆసక్తికరంగా అనిపించింది. అక్కడి నుంచి అసలు ఈ గేమ్ ఎవరిదనేది పరిశోధించడం మొదలుపెట్టా. ఒక కథకుడి గా దీన్ని ‘వాడిపోయిన పువ్వులు’ పేరుతో చిన్న కథగా రాయాలనుకున్నా.
కానీ రాస్తున్నప్పుడు ఇది సినిమా మెటీరియల్ అని అర్థమైంది. నా స్టయిల్ ఆఫ్ స్టొరీ టెల్లింగ్‌తో చేసిన పక్కా కమర్షియల్ సినిమా. ఇదొక మనిషి లైఫ్ జర్నీ. వైజాగ్‌లో ఉన్న పెద్ద పెద్ద పవర్ఫుల్ పర్సన్స్ అంతా బయట నుంచి వచ్చినవాళ్లే. సెల్‌ఫోన్ లేని రోజుల్లో దేశం మొత్తానికి ఒక నెంబర్‌ను పంపిం చడం ఈ కథలో నాకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్.
నిజంగా అదెలా జరిగిందో ఇప్పటికీ నాకు తెలియదు. ఒకవేళ నేనే రతన్ ఖత్రీ అయి ఉంటే ఏం చేసేవాడిని అని ఆయనలా ఆలోచించి, ఆ ఐడియాస్‌తో ఈ స్క్రిప్ట్ చేశా. వరుణ్‌తేజ్ లుక్స్ విషయం లో చిరంజీవి రిఫరెన్స్ ఉంది. నా ప్రాజెక్టులు ఇంకా -మూడున్నా యి. ఏది ముందనేది తర్వలోనే తెలుస్తుంది” అన్నారు.