calender_icon.png 2 October, 2024 | 4:06 AM

నవంబర్‌లో ‘మట్కా’ ఆటలు

02-10-2024 12:43:41 AM

హీరో వరుణ్‌తేజ్ నటిస్తున్న తాచా చిత్రం ‘మట్కా’. కరుణకుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్టీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు ముఖ్య తారాగణంగా ఉన్నారు.

ఈ చిత్రంలో తేజ్ నాలుగు డిఫరెంట్ అవతార్లలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా.. వరుణ్‌తేజ్, ఫైటర్స్‌తో కీలక యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు నిర్మాణానంతర పనులు కూడా శరవేగంగా జరుగుతుండగా, మేకర్స్ తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

కార్తీక పౌర్ణమికి ముందుగా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నట్టు తెలుపుతూ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో వరుణ్ మెట్ల పైనుంచి దిగుతున్న లుక్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; సినిమాటోగ్రఫీ: ఎ కిషోర్ కుమార్.