మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల వరుస పరాజయాలను చవిచూశాడు. దీంతో ఆయన సినిమాల థియేట్రికల్ మార్కెట్ డౌన్ అయ్యింది. తాజాగా వరుణ్ తేజ్ నటిస్తున్న ’మట్కా సినిమాతో వస్తున్నాడు. దాదాపు రూ.3.6 కోట్లకు ఆడియో డీల్ క్లోజ్ చేసినట్లు టాక్. అయితే వరుణ్ తేజ్ సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ డీల్. త్వరలోనే మట్కా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. హైదరాబాద్, వైజాగ్, కాకినాడలో మట్కా చిత్రీకరణ జరిగింది. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. నోరా ఫతేహి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్, ఎస్‌ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.