calender_icon.png 13 March, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంతోషకర వాతావరణంలో హోళి పండగ జరుపుకోవాలి: ఎస్సై బాబు

13-03-2025 05:45:12 PM

మఠంపల్లి: హోళీ పండుగ సందర్భంగా మఠంపల్లి ఎస్సై బాబు ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ ఉత్సవం జరుపుకునేవారు జాగ్రత్తలు పాటించాలని, యువత ఆదర్శంగా ఉండాలి. ప్రమాదాలకు దూరంగా ద్విచక్ర వాహనాలపై వేగంగా వెళ్ళవద్దు, సంప్రదాయ రంగులు ఉపయోగించడం ఆరోగ్యకరం అని ఎస్ఐ తెలిపారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా ఉత్సవం జరుపుకోవాలన్నారు. సంప్రదాయ పండుగలు ఏవైనా ప్రజలు కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని, నీటి ప్రవాహం, లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు. పండుగ వేళ ఎవరైనా గొడవలు పడినా, అసత్య ప్రచారం చేసినా, ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, మహిళలను వేదింపులకు గురిచేసిన కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.