calender_icon.png 16 March, 2025 | 2:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కీచక ఉపాధ్యాయుడు అరెస్టు

08-03-2025 11:00:50 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత బోధిస్తున్న కీచక ఉపాధ్యాయుడు మనోహర్ రెడ్డిని శనివారం అరెస్టు చేసినట్టు నిర్మల్ ఎస్పీ రాకేష్ మీనా తెలిపారు. గత నెలలో అదే పాఠశాలలో చదువుకుంటున్న కొందరు విద్యార్థులు పట్ల అసభ్యంగా వివరించిన ఉపాధ్యాయుడు మనోహర్ రెడ్డి తో పాటు మరో ఉపాధ్యాయుడు మోహన్ రావు పై ఎస్సీ ఎస్టీ చట్టంతోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది అన్నారు. అప్పటినుండి ఇద్దరు ఉపాధ్యాయులు పరారీలో ఉండగా శనివారం గణిత ఉపాధ్యాయుడు మనోహర్ రెడ్డిని పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఇదే కేసులో కేతువుగా ఉన్న మోహన్ రావు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు.