నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని వశిష్ట టెక్నో స్కూల్లో విద్యార్థులకు గణితంపై పట్టు సాధించేందుకు సోమవారం ప్రతిభ పోటీలను నిర్వహించారు. విద్యార్థులకు గణితం ఎలా నేర్చుకోవాలో నిర్వహించిన ప్రదర్శనలో లెక్కలను చూపారు. ఈ ప్రదర్శనలో పాఠశాల ప్రిన్సిపల్ మాధవి, శ్రీనివాస్ గౌడ్, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.