calender_icon.png 17 April, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరంతర పర్యవేక్షణతోనే తల్లి, బిడ్డల ఆరోగ్యం

09-04-2025 01:34:46 AM

ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కవిత రాణి

జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 8, (విజయక్రాంతి): నిరంతర పర్యవేక్షణతో ఆరోగ్య సలహాలు పొందడం ద్వారానే గర్భిణీలు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఐసిడిఎస్ జగిత్యాల అర్బన్ సూపర్వైజర్ కవితరాణి అన్నారు. పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని జంబిగద్దె అంగన్వాడీ కేంద్రంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా గర్భిణీల బరువు, ఎత్తు, జబ్బ కొలత తీసుకొని వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి తగిన సలహాలు అందజేశారు. గర్భిణీ అయినప్పటి నుండి బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చే వరకుగల మొదటి వెయ్యి రోజుల ప్రాముఖ్యత, తీసుకోవలసిన జాగ్రత్తలు సూపర్వైజర్ కవితరాణి తల్లులకు వివరించారు. 2 సంవ త్సరాల లోపు పిల్లల గ్రోత్ మానిటరింగ్ ద్వారా వారి ఆరోగ్య పరిస్థితిని తల్లులకు వివరించారు.

పోషణ్ పక్వాడ కార్యక్రమం ఈనెల 8 నుండి 22 వరకు ప్రతి అంగన్వాడి కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని సూపర్వైజర్ వివరించారు. ఈ కార్యక్రమం లో అంగన్వాడి టీచర్లు నీలవేణి, దయావతి, యతీశ్వరి, రజిని, శివ ప్రియ, కళావతి, రామలక్ష్మి, మమత తల్లిదండ్రులు పాల్గొన్నారు.