calender_icon.png 19 March, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికలలో దళిత బహుజన పార్టీకి అగ్గిపెట్టె గుర్తు కేటాయింపు

18-03-2025 08:59:53 PM

దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలలో దళిత బహుజన పార్టీ (డిబిపి) ఎన్నికల గుర్తుగా అగ్గిపెట్టెను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేటాయించడం జరిగిందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం రెడ్ హిల్స్ లోని తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో జరిగిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం కమిషన్ కార్యదర్శి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో దళిత బహుజన పార్టీ తరఫున పార్టీ అధ్యక్షులు కృష్ణ స్వరూప్ పాల్గొనడం జరిగింది.

త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పంచాయతీ రాజ్, స్థానిక మున్సిపల్, నగర మున్సిపల్ కార్పొరేషన్ జరిగే లోకల్ బాడీ ఎన్నికలలో దళిత బహుజన పార్టీ తరఫున అగ్గిపెట్టె గుర్తుపై అభ్యర్థులు పోటీ చేస్తారని కృష్ణ స్వరూప్ తెలిపారు. తమ పార్టీకి అగ్గిపెట్టె  గుర్తును కేటాయించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు కృష్ణ స్వరూప్ అభినందనలు తెలియజేశారు. వచ్చే స్థానిక ఎన్నికలలో దళిత బహుజన ప్రజలను అన్ని దోపిడీ కుల పార్టీలు మోసం చేశాయని ఆరోపించారు. ఇలాంటి మనువాద ప్రజా వ్యతిరేక పార్టీలను రానున్న స్థానిక ఎన్నికలలో గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.