calender_icon.png 1 March, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షంతో మ్యాచ్ రద్దు.. సెమీస్ చేరిన ఆస్ట్రేలియా

28-02-2025 11:50:33 PM

లాహోర్‌: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో భాగంగా శుక్రవారం లాహోర్‌(Lahore)లో జరిగిన గ్రూప్ బి మ్యాచ్ అఫ్గానిస్థాన్(Afghanistan) VS ఆస్ట్రేలియా(Australia) వర్షం కారణంగా రద్దయింది. దీంతో అంపైర్లు ఇరుజట్లకు చెరొక పాయింట్ ను కేటాయించారు. గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సెమీఫైనల్‌(Semi Final)కు చేరుకుంది. తోలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్ 50 ఓవర్లలో 273 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో సెదిఖుల్లా అటల్ (85), అజ్మతుల్లా ఒమర్జాయ్ (67) అర్ధ సెంచరీలు చేశారు.

బెన్ ద్వార్షూయిస్ 47 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టగా, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా తలో రెండు వికెట్లు పడగొట్టారు. వర్షం రాకముందే, ట్రావిస్ హెడ్(Travis Head) త్వరితగతిన అర్ధ సెంచరీ (40 బంతుల్లో 59 నాటౌట్) సాధించాడు. ఆస్ట్రేలియా 274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 12.5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. గ్రూప్ బి నుంచి అఫ్గానిస్థాన్ సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే రేపు జరగబోయే చివరి గ్రూప్ బి మ్యాచులో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికాను(200 పరుగుల) భారీ తేడాతో ఓడించాలి.