27-02-2025 01:46:32 AM
గద్వాల, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): నకిలీ సర్టిఫికెట్ లతో ప్రభుత్వం ఉద్యోగం పోంది ఇటీవల ముగ్గురు కటకట పాలైన సంఘటన గద్వాల జిల్లా చోటు చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. నకిలీ సర్టిఫికెట్ లకు సంబందించిన ప్రధాన సూత్రధారి మిర్యాలగూడకు చెందిన మాజీ ప్రిన్సిపాల్ బాలకృష్ణను అరెస్ట్ చేసి రిమండ్ కు తరలించినట్లు డి ఎస్పీ మొగులయ్య తెలిపారు. బుధవారం డి ఎస్పీ కార్యాలయం లో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
నకిలీ సర్టిఫికెట్ లతో వ్యవసాయ శాఖ లో ఉద్యోగం పొందిన నేపథ్యంలో ఆ శాఖ ఉన్నతాధికారుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇటీవల ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం జరిగిందన్నారు. ప్రధాన సూత్రధారి అయిన బాలకృష్ణను విచారణ చేయగా నేరాన్ని ఒప్పుకోవడంతో రిమాండ్ తరలించడం జరిగిందని ఇంకా నకిలీ సర్టిఫికెట్లు వ్యవహారం విచారణ చేస్తున్నామన్నారు. అతని నుంచి ఇంటర్మీడియట్ బిసిఏ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో గద్వాల సర్కిల్ ఇన్స్పెక్టర్ టంగు టూరి శ్రీను పట్టణ ఎస్సు కళ్యాణ్ రావులు పాల్గొన్నారు.