calender_icon.png 23 November, 2024 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నాం

29-10-2024 08:19:25 PM

గద్వాల్ మున్సిపల్‌ పరిధిలో మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నాం

జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్

గద్వాల(విజయక్రాంతి): జిల్లాలో  గద్వాల్ మున్సిపల్‌ పరిధిలో డ్రోన్‌ సర్వే చేసి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ఆవరణలో డీటీసీపీ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్‌ ను మున్సిపల్‌ చైర్‌పర్సన్ బి.ఎస్ కేశవులు‌‌, మున్సిపల్‌ అధికారులు, సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులతో పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో భాగంగా, మున్సిపాలిటీ సమస్యలు లేకుండా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నామని అన్నారు. భవిష్యత్‌ తరాలకు డిజిటల్‌ రూపంలో అందుబాటులో ఉంచడమే లక్ష్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకంలో భాగంగా GIS ఆధారిత ప్రణాళిక కోసం ఎంపికైన తెలంగాణలోని 20 మునిసిపాలిటీలలో ఒకటైన గద్వాల మునిసిపాలిటీలో డిజిటల్ మాస్టర్‌ ‌ సర్వే చేయడం కోసం సెలెక్ట్‌ చేసినట్లు తెలిపారు. గద్వాల్‌ మున్సిపాలిటీకి సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌ డిజిటల్‌ సర్వేను లేటెస్ట్‌ టెక్నాలజీ, డ్రోన్‌ కెమెరాల సహాయంతో పూర్తిగా వివరాలతో తయారుచేస్తున్నామని అన్నారు.

ప్రతిదీ చిత్రాలతో విభాగాల వారీగా సేకరించి బేస్‌ మ్యాప్‌లను తయారు చేస్తారన్నారు. డ్రోన్ సర్వేల ద్వారా సేకరించిన ఖచ్చితమైన మ్యాపింగ్ తో భవనాలు, రహదారులు, నీటి వనరులు, పార్కులు, మురుగు వ్యవస్థలు వంటి మౌలిక వసతుల స్థితిని పరిశీలించి, వాటి నిర్వహణ,అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించవచ్చని అన్నారు.కంప్యూటర్లో డ్రోన్ సర్వే పద్ధతులను పరిశీలించారు. డ్రోన్ ఎలా పని చేస్తుందో, మునిసిపాలిటీని మొత్తం స్థలాన్ని ఎలా కవర్ చేస్తుందో, ఆ డేటాను ఎలా ప్రాసెస్ చేస్తారో, డ్రోన్ సర్వేలో అందులో ఉన్న సమాచారాన్ని ఎలా వినియోగించాలో వివరంగా తెలుసుకున్నారు.ఈ మాస్టర్‌ ప్లాన్‌ సర్వే సాయంతో గద్వాల్‌ పట్టణం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీటీసీపీ అడిషనల్‌ డైరెక్టర్‌ రమేశ్‌బాబు,మున్సిపల్‌ కమిషనర్‌ దశరథ్,టౌన్ ప్లానింగ్ అదికారి కుర్మన్న, సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు,డీటీపీసీ అధికారులు, మున్సిపల్‌ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.