calender_icon.png 25 October, 2024 | 7:03 AM

20 ఏండ్ల తర్వాత కరీంనగర్‌కు మాస్టర్ ప్లాన్

25-10-2024 01:04:35 AM

  1. డిసెంబర్‌లో మాస్టర్‌ప్లాన్ అమలు
  2. ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోండి
  3. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్, అక్టోబరు 24 (విజయక్రాంతి): రెండు దశాబ్దాల తరువాత కరీంనగ ర్ పట్టణానికి మాస్టర్‌ప్లాన్‌ను రూపకల్పన చేశామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేంద ర్ రెడ్డి తెలిపారు. మాస్టర్ ప్లాన్‌ను డిసెంబర్‌లో విడుదల చేస్తామని చెప్పారు. గురు వారం నగరంలో విలేకరులతో మాట్లాడు తూ సుడా పరిధిలోని ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

26 ఆగస్టు 2020 తర్వాత వ్యవసాయ భూ ముల ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకున్న ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ చేసుకునే అవకాశం కాని, బిల్డిం గ్ పర్మిషన్ కాని తీసుకునే అవకాశం లేదన్నారు. సుడా పరిధిలో ఇప్పటివరకు ఇంకా 21 వేల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని క్లియర్ చేసుకోవాలని సూచించారు. సుడా అప్లికేషన్లను సవరించడానికి, అనుమతి కోసం గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు లాగిన్ ఇచ్చామ న్నారు.

మాస్టర్ ప్లాన్‌ను సుడా పరిధిలో త్వరితగతిన అందుబాటులోకి తీసుకువస్తా మన్నారు. ఈ నెల చివరిలోపు మాస్టర్ ప్లాన్‌పై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేల సమయం తీసుకొని ప్రజాభిప్రాయ సేకరణ కోసం సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.

అంగారికా టౌన్‌షిప్‌లో ప్లాట్లు కొన్నవారికి మౌలిక సదుపాయాలు కల్పన కోసం రెండు కోట్లతో పనులు చేయడానికి టెండర్లు పిలిచామని, వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.  సమావేశంలో సయ్యద్ ఖమ్రొద్దీన్, కుర్ర పోచయ్య, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, దండి రవీందర్, లయక్, షబానా మహ్మద్, ఇంద్రజిత్ రెడ్డి, ముల్కల కవిత, తిరుమల, హసీనా, మహాలక్ష్మి, మాసుంఖాన్, సత్యనారాయణ రెడ్డి, కిరణ్ రెడ్డి, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.