13-02-2025 11:10:20 AM
- కస్టడీకి అనుమతించిన న్యాయమూర్తి
- వివిధ కోణాల్లో విచారణ చేయనున్న పోలీసులు
రాజేంద్రనగర్, (విజయక్రాంతి): మస్తాన్ సాయిని న్యాయమూర్తి పోలీసు కస్టడీకి అనుమతించారు. సాయంత్రం 5 గంటలకు నార్సింగి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. ఆయనను పోలీసు కస్టడీకి రెండు రోజులపాటు రాజేంద్రనగర్ న్యాయమూర్తి అనుమతించిన విషయం తెలిసిందే. జైలులో ఉన్న మస్తాన్ సాయిని రెండు గంటలకు కస్టడీకి తీసుకొని ఉన్న పోలీసులు అనంతరం సుమారు 5 గంటలకు నార్సింగి పోలీస్ స్టేషన్ కు తీసుకురానున్నారు.
ఇటీవల లావణ్య ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు అతడిని కోకాపేట సమీపంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మస్తాన్ సాయి కేసులో అనేక అంశాలు వెలుగు చూసిన నేపథ్యంలో నార్సింగి పోలీసులు అతడిని వివిధ కోణాల్లో విచారణ చేయనున్నట్లు సమాచారం. అతడి నుంచి తీసుకొచ్చిన హార్డ్ డిస్క్ ను లావణ్య పోలీసులకు అందజేసిన విషయం తెలిసిందే అందులో వందలాది యువతులు, మహిళలతో మస్తాన్ సాయి సన్నిహితంగా ఉన్న వీడియోలు వెలుగు చూశాయి. దీంతోపాటు పలువురు ప్రముఖుల వీడియోలు కూడా అందులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.