11-02-2025 01:16:40 AM
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 10: మస్తాన్ సాయి కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. అతడిని ఐదు రోజు లు కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు రాజేంద్రనగర్ కోర్టును ఆశ్రయిం చారు. కోర్టు రెండు రోజులు కస్టడీకి ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ నెల 13 నుంచి 15 వరకు రెండు రోజులపా టు అతడిని నార్సింగి పోలీసులు కస్టడీకి తీసుకొని విచారణ జరపనున్నారు.