calender_icon.png 22 October, 2024 | 8:25 AM

భారీగా తగ్గిన విదేశీ మారక నిల్వలు

19-10-2024 12:00:00 AM

ఒకేవారంలో 10 బిలియన్ డాలర్ల తగ్గుదల

 న్యూఢిల్లీ, అక్టోబర్ 18:  దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు రికార్డు గరిష్ఠస్థాయి నుంచి భారీగా తగ్గాయి. శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం  అక్టోబర్ 11తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు 10.644 బిలియన్ డాలర్లు తగ్గి 690.43  బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.

సెప్టెంబర్ చివరినాటికి ఫారెక్స్ నిల్వలు భారీగా  12.588 బిలియన్ డాలర్లు పెరిగి 704.885 బిలియన్ డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.  700 బిలియన్ డాలర్ల స్థాయిపైన వరుసగా నిలిచిన విదేశీ మారక నిల్వలు తాజా సమీక్షావారంలో ఆ స్థాయి దిగువకు పడిపోయాయి. గత అక్టోబర్ 4తో ముగిసినవారంలో సైతం ఇవి తగ్గాయి. 

తాజా సమీక్షావారంలో విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 10.542 బిలియన్ డాలర్లు తగ్గి 601.101 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు. 

క్షీణించిన బంగారం నిల్వలు

ఆర్బీఐ వద్దనున్న బంగారం నిల్వలు కూ డా సమీక్షావారంలో  98  మిలియన్ డాల ర్లు తగ్గి 65.658 బిలియన్ డాలర్లకు చేరా యి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 86 మిలియన్ డాలర్లు పెరిగి18.339 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఐఎంఎఫ్ వద్ద నున్న రిజర్వులు 20 మిలియన్ డాలర్లు  త గ్గి 4.333 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.