calender_icon.png 27 February, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదు

27-02-2025 04:53:00 PM

కాటారం,(విజయక్రాంతి): మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానంతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి గురువారం జరిగిన పోలింగ్ లో భారీ ఎత్తున ఓటర్లు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగిన పోలింగ్ ప్రక్రియలో ఉదయం కొంత మందకోడిగా కొనసాగినప్పటికీ, మధ్యాహ్నం తర్వాత పోలింగ్ ఉపందుకొన్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, మహాదేవపూర్, పలిమల, మహ ముత్తారం, మలహర్ మండలాల్లో పెద్ద ఎత్తున పోలీస్  బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ గడ్డం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాటారం సిఐ నాగార్జున రావు, ఎస్ ఐ అభినవ్ నిరంతరం గస్తీ నిర్వహించారు. 

పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆయా రాజకీయ పార్టీ నేతలు, కార్యకర్తలను పోలింగ్ కేంద్రం పరిసరాల్లోకి రాకుండా గట్టి చర్యలు చేపట్టారు. కాటారం 498 పోలింగ్ స్టేషన్ లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి 877 మంది ఓటర్లు ఉండగా 656 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 74.80 శాతం  ఓట్లు నమోదైనట్లు తెలిపారు. ఇందులో పురుషులు 442, మహిళలు 214 మంది ఉన్నట్లు తహసిల్దార్ నాగరాజు తెలిపారు. అలాగే 273 పోలింగ్ కేంద్రం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో 40 మందికి గాను 36 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 25, మహిళలు 11 మంది 90 శాతం తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు సెక్టోరల్ అధికారి రాజశేఖర్ తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు వెల్లడించారు.