l దక్షిణ మధ్య రైల్వే రికార్డు
l పెరగనున్న రైళ్ల వేగం
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): దక్షిణ మధ్య రైల్వే ట్రాక్ నెట్‌వర్క్ పునరుద్ధరణలో తన రికార్డులను తానే అధిగమించి రికార్డు సృష్టిస్తోంది. గతంలో ఎప్పు డూ లేని విధంగా జోన్ పరిధిలో గత ఆర్థిక సంవత్సరంలో 649 కిలోమీటర్ల ట్రాక్ పునరుద్ధరణ చేసి అత్యధిక పనితీరును సాధించి ంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 45 శాతం అధికం. ఈ ట్రాక్ విస్తరణ పనులన్నింటినీ మానవ ప్రమేయం లేకుండానే యాంత్రీకరణ ద్వారా పూర్తి చేశారు.
ఫలితంగానే ఈ స్థాయిలో నెట్‌వర్క్‌ను విస్తరించేం దుకు అవకాశం ఏర్పడింది. రైల్వేట్రాక్ పునరుద్ధరణ ద్వారా రైళ్ల వేగాన్ని పెంచి తద్వారా ప్రయాణికులు మరింత త్వరగా గమ్యస్థానం చేరేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తు తం ప్రవేశపెట్టిన అధునాతన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణించేందుకు గాను సుమారు 130 కి.మీ వేగంతో కూడా వెళ్లేందుకు ఈ ట్రాక్‌లను సిద్ధం చేశారు. ఈ పునరుద్ధరణ పనులతో సాధారణ రైల్వే ట్రాక్‌ల్లోనే రైళ్ల వేగాన్ని పెంచుతున్నారు.
రైల్వే వేగానికి వెన్నెముక ట్రాక్ పునరుద్ధరణ...
రైల్వే ట్రాక్ పునరుద్ధరణ ద్వారా ప్రయాణికులు, సరుకు రవాణా రైళ్లు ఎలాంటి అవాంతరం లేకుండా వేగంగా ప్రయాణించేందుకు అవకాశం ఏర్పడుతుంది. సమ ర్థ మైన రైల్వే కార్యకలాపాలు, భద్రతను పెంచే చర్యల్లో ట్రాక్ పునరుద్ధరణ అనేది అత్యంత కీలకం. ఒక విధంగా చెప్పాలంటే రైల్వే వేగానికి ట్రాక్ వెన్నెముక వంటిది. సాధారణంగా స్లీపర్ల పునరుద్ధరణలో మోడిఫైడ్ వైడర్‌బేస్ కాంక్రీట్ స్లీపర్లతో పాటు పాత స్లీపర్లను మా ర్చడం, పాత పట్టాలను క్లాస్ పట్టాలతో మార్చడం, ప్లెయిన్ ట్రాక్ వేయడం, పాయిం ట్లు, క్రాసింగ్‌లను మార్చ డం వంటి అనేక పనులు ఉంటాయి.
స్లీపర్లు, పట్టాల పునరుద్ధరణ పుల్ ప్లాసర్ క్విక్ రిలేయింగ్ సిస్టం (పీక్యూఆర్‌ఎస్) మెషీన్ల ద్వారా నిర్వహిస్తా రు. ట్రాక్ రిలేయింగ్ ట్రెయిన్ (టీఆర్‌ఆర్‌టీ) మెషీన్ల ద్వారా సాధారణ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తారు. పాయింట్లు, క్రాసింగ్‌ల కోసం టి 28 యంత్రాల ద్వారా పనులు చేపడతారు. ట్రాక్ పునరుద్ధరణలో కాంక్రీట్ స్లీపర్లను మ్యాన్యువల్‌గా వేయటం కష్టమే కాకుండా స్లీపర్లకు కూడా నష్టం వాటిల్లుతుంది. అదనంగా ట్రాక్ పునరుద్ధరణ పనులను చేపట్టి న వెంటనే రైలు ప్రారంభ వేగ పరిమితిలో వ్యత్యాసం ఉంటుంది. మ్యాన్యువల్‌గా చేపట్టిన మార్గాలతో పోలిస్తే మెకానికల్ పద్ధతి లో రైలు వేగపరిమితి గంటకు 20 కి.మీ బదులుగా గంటకు 30 కి.మీ స్పీడ్ పెరుగుతుందని అధికారులు తెలిపారు. దీనికి అదనంగా ట్రాక్ నిర్వహణ పనుల కోసం పట్టే సమయం కూడా ఆదా అవుతుంది.