calender_icon.png 26 December, 2024 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ..

07-11-2024 12:22:48 PM

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్న పోలీసులు

చోరీలకు పాల్పడింది నలుగురు దుండగులు

నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో ఓ రెండు దుకాణాల్లో గుర్తు తెలియని నలుగురు దుండగులు చోరీకి పాల్పడిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని రామ్ దేవ్ కిరాణా షాప్ తో పాటు లలిత పెయింట్స్ దుకాణంలో గుర్తు తెలియని నలుగురు దుండగులు చోరీకి పాల్పడ్డారు. కిరాణా దుకాణంలో నగదుతో పాటు సామాగ్రి కూడా ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పెయింట్ షాప్ లో నగదుతో పాటు రెండు లక్షల విలువ చేసే రంగు డబ్బాలను కూడా దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని దుండగులు నలుగురు బుధవారం రాత్రి షాపు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు వర్ని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సీసీ ఫుటేజీలో నలుగురు గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు తెలుస్తుందని పోలీసులు తెలిపారు.