calender_icon.png 18 March, 2025 | 5:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిలింనగర్ షేక్‌పేటలో దొంగల బీభత్సం

18-03-2025 08:46:50 AM

ఫిలింనగర్: హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్(Film Nagar Police Station) పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. షేక్‌పేటలో  డైమండ్ హిల్స్(Shaikpet Diamond Hills) లోని మొజాహిద్ ఇంట్లో 34 తులాల నగలు చోరీ అయ్యాయి. 4.5 లక్షల నగదు, 550 కెనెడియన్ డాలర్లు(Canadian Dollar) అపహరణకు గురయ్యాయి. మొజాహిద్ ఇటీవలే ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. కుటుంబంతో బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో చోరీ జరిగింది. సీసీ కెమెరా హోర్డ్ డిస్క్ లను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. చోరీ జరిగినట్లు గమనించిన కుటుంబసభ్యులు ఫిలింనగర్ పోలీసులను(Film Nagar Police) ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.