calender_icon.png 22 September, 2024 | 10:04 PM

స్టెరాయిడ్స్ సరఫరా చేస్తున్న యువకుడు అరెస్ట్

11-07-2024 02:32:43 PM

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి రోజు ఎక్కడో అక్కడ మత్తు పదార్థాలు పట్టుబడుతున్నాయి. నగరంలో యువకులు గంజాయి, డ్రగ్స్, వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. తాజాగా సికింద్రాబాద్ లో గురువారం భారీగా స్టెరాయిడ్స్ పట్టుబడింది. స్టెరాయిడ్స్ సరఫరా చేస్తున్న యువకుడు అరెస్టు అయ్యాడు. జిమ్ లో యువకులకు స్టెరాయిడ్స్ సరాఫరా చేస్తున్న ఖాసిం అనే వ్యక్తిని డ్రగ్ కంట్రోల్ అధికారులు అరెస్ట్ చేశారు. దేహదారుఢ్యం కోసం యువకులకు స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లు గుర్తించారు.