calender_icon.png 15 January, 2025 | 10:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎయిర్పోర్టులో భారీగా గోవా మద్యం పట్టివేత

05-09-2024 11:21:27 AM

12 కేసులు నమోదు 

శంషాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ రావు 

రాజేంద్రనగర్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు గోవా నుంచి అక్రమంగా తీసుకొచ్చిన రూ. 12లక్షల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల 12 మంది గోవాకు వెళ్లారు. అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసి తిరిగి వచ్చేటప్పుడు హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని అక్రమంగా తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు ఏర్పోర్ట్ లో బుధవారం అర్థరాత్రి తర్వాత తనిఖీలు చేశారు.

కస్టమ్స్ అధికారులు వారి లగేజీని చెక్ చేయగా 415 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. వీటి విలువ సుమారుగా రూ.12 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. . 415 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు .. 12 మంది నిందితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి , డిసి రంగారెడ్డి దశరథ్, ఏసి ఆర్ కిషన్, ఏఈ ఎస్ జీవన్ కిరణ్ ఎన్ఫోర్స్‌మెంట్ టీములు రెండు, శంషాబాద్ డిటిఎఫ్ ఎక్సైజ్ పోలీస్ టీమ్, సిబ్బంది పాల్గొన్నారు.