27-02-2025 02:01:25 AM
మద్దికుంట బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు షబ్బీర్ అలీ
సోమలింగేశ్వర ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి
సంతాయిపేట భీమేశ్వరాలయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి పూజలు
కామారెడ్డి, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): హరి ఓం శివోహం అంటూ భక్తులు శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా కుల మతాలకతీతంగా శివాలయాల వద్ద ఆయా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉపవాస దీక్షతో కుటుంబ సమేతంగా శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో ఏర్పాటు చేసిన శ్రీ కాశి విశ్వేశ్వర ఆలయంలో భక్తులు ఉదయం నుంచి వచ్చి అభిషేకాలు నిర్వహించారు. బిక్కనూరు సిద్ధ రామేశ్వరం ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి దంపతులు పూజల్లో పాల్గొన్నారు. రామారెడ్డి మండలం మద్దికుంట బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పట్టు వస్త్రాలను బహుకరించి అన్న పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతోపాటు మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడువాయి మండలం సంతాయిపేటలోని భీమేశ్వరాలయం దోమకొండ మండల కేంద్రంలోని శివరాం మందిర్ గడికోటలోని మహాదేవుని ఆలయం నాగిరెడ్డిపేట మండలం లోని త్రీ లింగేశ్వర ఆలయం బాన్సువాడ మండలం దుర్కి లోని సోమలింగేశ్వర ఆలయం లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు పూజలు నిర్వహించారు.
ప్రధాన శివాలయాలతో పాటు ప్రతి గ్రామంలో మండల కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో భక్తులు పెద్ద ఎత్తున శివాలయాల వెళ్లి ప్రత్యేక అర్చనలు అభిషేకాలు నిర్వహిం చారు. మద్దికుంట బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. అగ్నిగుండాలు రథోత్సవం శివపార్వతుల కళ్యాణం అన్న పూజ వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో కామారెడ్డి జిల్లా ప్రజలే కాకుండా నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లా సిద్దిపేట మెదక్ హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఉపవాస దీక్షలతో శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగాయి. ఆ యా ఆలయ కమిటీలు, పూజారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. శివాలయాలకు భక్తులు తండోపతండాలుగా వచ్చి శివనామ స్మరణతో మొక్కులు తీర్చుకున్నారు.
శివనామస్మరణతో కిటకిటలాడిన శివాలయాలు
బాన్స్వాడ డివిజన్ కేంద్రంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి బొల్లం గ్రామంలో గల ఆది బసవేశ్వర ఆలయం దుర్కి గ్రామ శివారులో గల సోమలింగేశ్వర ఆలయం లింగేశ్వర ఆలయం నస్రుల్లాబాద్ మండలం గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర ఆలయం బాన్సువాడ సంగమేశ్వర ఆలయం ఇలా పలు ఆలయాలను బుధవారం మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులు ఉదయం వేకువ జామునే ఆలయానికి చేరుకొని భక్తులు ఉపవాస దీక్షతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో అర్చకులు అభిషేకాలు నిర్వహించి సోమలింగేశ్వర ఆలయానికి గత సంవత్సరం కంటే అధిక సంఖ్యలో రావడంతో దర్శనానికి భక్తులు గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు అర్చనలు నిర్వహించి బుక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆలయాలని భక్తులతో కిటకిటలాడాయి.
శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
తాడ్వాయి, ఫిబ్రవరి, 26 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో బుధవారం మహాశివరాత్రి పండగ వేడుకలు ఘనంగా జరిగాయి తాడువాయి మండలంలోని సంతాయిపేట శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు శివరాత్రి పండుగ సందర్భంగా ఉపవాసం ఉన్న భక్తులు ఆలయానికి చేరుకుని ఆలయం పక్కనే ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి వాగులో ప్రత్యేక పుణ్య స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు మండలంలోని కృష్ణాజివాడి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో, తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆలయంలో, చిట్యాల లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా భక్తులు తరలివచ్చి ఆలయాల్లో పూజలు చేశారు ఆయా ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు
జుక్కల్ ఎమ్మెల్యే పూజలు
జుక్కల్, ఫిబ్రవరి 26: (విజయ క్రాంతి )కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాం సాగర్ మండలంలోని జక్కాపూర్ బీరప్ప స్వామి ఆలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వార్షికోత్సవ వేడుకలకు హాజరై పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఆయనను సన్మానించారు. పిట్లం ఏఎంసీ ఛైర్మన్ చీకోటి మనోజ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, మద్నూర్ సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్మాజీ సర్పంచ్ కంసవ్వ, వెంకటరామిరెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.