calender_icon.png 19 April, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిఖనిలో గర్జించిన వీహెచ్పీ బజరంగ్దళ్

19-04-2025 05:00:20 PM

హిందువులపై దాడికి నిరసనగా నగరంలో భారీ ర్యాలీ..

రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా..

గోదావరిఖని (విజయక్రాంతి): పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై ముస్లిం మూకల భౌతిక దాడులపై గోదావరిఖనిలో హిందూ సమాజం గర్జించింది. బెంగాల్ ప్రభుత్వంను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్రీయ విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు శనివారం రామగుండం మున్సిపల్ టీ జంక్షన్ వద్ద వీహెచ్ పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు, మహిళలు నిరసన ప్రదర్శన చేపట్టారు. హిందువులపై దాడులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నగర పాలక సంస్థ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి అనంతరం ధర్నా చేపట్టారు. వీహెచ్ పీ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల్ల సత్యం జీ, విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్ మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.

హిందువులపై ముస్లిం మూకలు దాడుల చేస్తుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్న సీఎం మమతా బెనర్జీపై అనర్హత వేటు వేసి ప్రభుత్వలను రద్దు చేయాలన్నారు. ముర్షిదాబాద్ జిల్లాలో హిందువులపై ముస్లిం మూకల దాడులను తిప్పికొట్టాలని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం వర్ఫ్ బోర్డు బిల్లును నిరసిస్తూ ముస్లిం మూకల అల్లర్లపై రాష్ట్రపతికి లేఖను కూడా సమర్పించామన్నారు. పోలీస్ వాహనాలను సైతం తగలబెట్టి హిందువులను భయభ్రాంతులకు గురి చేయడం శోచనీయమన్నారు. మనుతా బెనర్జీ ప్రభుత్వం కనీసం ఏలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. దాడులకు కారణమైన అక్కడి మంత్రి మౌలావా సిద్ధికి మద్దతు కూడా తెలపడం శోచనీయమన్నారు.

అక్కడి హిందువులకు రక్షణగా ప్రతి కార్యకర్త తరలివెళ్తామన్నారు. అనంతరం బల్దియా కమిషనర్ ద్వారా రాష్ట్రపతికి లేఖ పంపించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ పీ నగర కార్యదర్శి మ్యాదగోని రవీందర్, భజరంగ్ దళ్ కన్వీనర్ సంపత్, నేరేడుకొమ్మ వెంకటస్వామి, మునిగాల సంపత్, అడిగొప్పుల రాజు, అరవింద్, చక్రపాణి, లింగన్న, బండ రాజేశ్, మల్లికార్జున్, చంద్రశేఖర్, మమత భవా తిరుమల, లలిత, స్వప్న, రాజేశ్, శివ, సంతోష్, శేఖర్, సతీశ్, ఓదెలు, కిశోర్ అధిక సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.