06-03-2025 11:11:52 AM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి శాంతి ఖని గని 2 భారీ బందోబస్తు లాంగ్ బాల్ ప్రాజెక్టు విస్తరణ కోసం బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్ నేతృత్వంలో పోలీసులు గురువారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్వాసితుల నుండి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా వారు కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చే కార్మికులు, నిర్వాసిత రైతులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపించారు. భారీగా తరలివచ్చిన వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించారు. గని వద్ద ముగ్గురు సీఐలు,10 మంది ఎస్సై లు,16 మంది ఏ ఎస్సై లు,35 మంది కానిస్టేబుళ్లు,16 మంది మహిళ ఏఎస్సైలు బందోబస్తు నిర్వహించారు.