calender_icon.png 19 April, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమాన్ జయంతి ఉత్సవాలకు భారీ బందోబస్తు

10-04-2025 12:28:38 AM

  1. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు

రూట్ మ్యాప్‌లను పరిశీలించిన కమిషనర్, పోలీసులు

ఎల్బీనగర్, ఏప్రిల్ 9 : త్వరలో జరుగనున్న హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి శాంతి భద్రతల స మస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసులను రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశిం చారు. బుధవారం రాత్రి కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం, కొత్తపేట, చంపాపేట్, సిం గరేణి కాలనీ, సరూర్ నగర్ లోని ట్యాంక్ బండ్ పోస్ట్ ఆఫీస్, గాంధీ విగ్రహం, దిల్ సుఖ్ నగర్, సరస్వతి నగర్ తదితర ప్రాంతా ల్లో హనుమాన్ జయంతి ఉత్సవాల రూట్ మ్యాప్ లను స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలీసు అధి కారులకు కమిషనర్ పలు సూచనలు చేశారు. రాచకొండ పరిధిలోని సున్నితమైన ప్రదేశాల్లో ఉత్సవాల నిర్వహణలో తగిన జాగ్రత్త లు తీసుకోవాలని, శాంతియుతంగా ఊరేగింపులు జరిగేలా చూడాలని, భక్తులతో, ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వ యంతో వ్యవహరించాలని సూచించారు. మతసామరస్యానికి భంగం కలిగించే చర్యలను పోలిసు శాఖ ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు.

భక్తులు, ప్రజలు సంతోషంగా, శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని, పోలీసు లకు సహకరించాలని కమిషనర్ కోరారు.  కమిషనర్  వెంట ఎల్బీనగర్ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, డీసీపీ స్పెషల్ బ్రాంచ్ నర్సింహా రెడ్డి, డీసీపీ ట్రాఫిక్-2 శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.