calender_icon.png 20 January, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో భారీగా గంజాయి పట్టివేత

20-01-2025 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 19(విజయక్రాంతి): ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆదివారం నగరంలోని ఐదుచోట్ల నిర్వహించిన తనిఖీల్లో సుమారు 9.13కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చర్లపల్లి రాంపల్లి రోడ్‌లో హరికృష్ణ, ఒడిశాకు చెందిన వైద్యనాథ్ అనే వ్యక్తుల వద్ద 4కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ రైల్వే స్టేషన్ పార్కింగ్ వద్ద 1.3కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

మేడ్చల్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఒడిశాకు చెందిన వ్యక్తి వద్ద 0.59కిలోల గంజాయిని పట్టుకున్నారు. మాదాపూర్ సిద్ధివినాయకనగర్ వద్ద 14.14 గ్రాముల హాషీశ్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. చందాపూర్‌లో ఆటోలో గంజా యి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1.50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి పెడ్లర్ అరెస్టు..

మలక్‌పేట, జనవరి 19: గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర నిందితుడిని చాదర్‌ఘాట్, సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 62 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.సౌత్‌ఈస్ట్ జోన్ డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

రామగుండం ప్రాంతానికి చెందిన రాజు జాట్(35) 62కిలోల గంజాయితో మహారాష్ట్రకు వెళ్లే క్రమంలో శనివారం నగరంలోని చాదర్‌ఘాట్ వద్ద ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజుపై గతంలో కూడా పలు పీఎస్‌లలో కేసులు నమోదై ఉన్నాయని డీసీపీ పాటిల్ తెలిపారు.