calender_icon.png 18 March, 2025 | 5:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీగా మావోయిస్టులు లొంగుబాటు..

17-03-2025 10:10:03 PM

నేడు 19 మంది మావోయిస్టులు లొంగుబాటు..  

జనజీవన స్రవంతిలో కలిసేందుకే మొగ్గుచూపుతున్నారు..

చర్ల (విజయక్రాంతి): సిపిఎంఎల్ మావోయిస్టు సభ్యులు అజ్ఞాతంలో ఉండేందుకంటే, జనజీవన స్రవంతిలో కలిసేందుకే మొగ్గు చూపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం 64 మంది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టు సభ్యులు లొంగిపోయిన విషయం తెలిసిందే. అదే తరహాలో సోమవారం చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లాకు చెందిన 19 మావోయిస్టులు లొంగిపోయారు. దీంతో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. జిల్లాలోని 19 మంది మావోయిస్టులు విప్లవబాట విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసి జీవితాన్ని గడిపేందుకు జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు.

లొంగిపోయిన మావోయిస్టులు అందరికీ మొత్తం రూ.29 లక్షలు బహుమతి ప్రభుత్వం ప్రకటించింది. దానితో పాటుగా లొంగిపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నుండి రూ.25 వేల ప్రోత్సాహక మొత్తాన్ని అందించారు. లొంగిపోయిన మొత్తం 19 మావోయిస్టులు PAMS ఏరియా కమిటీకి చెందినవారు. మావోయిస్టు పిఎల్‌జిఎ బెటాలియన్, పిపిసిఎం, ఎసిఎం, ఎఓబి డివిజన్, మినిటియా స్థాయి మావోయిస్టు సభ్యులు సిఆర్పిఎఫ్ దేవేంద్ర సింగ్ నెగి, బిజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ సమక్షంలో లొంగిపోయారు. ఇదిలా ఉండగా ఆదివారం ఛత్తీస్‌గఢ్ గడ్చిరోలి జిల్లా భామ్రగడ్ తాలూకా కవాండేలో పోలీస్ స్టేషన్ కు 100 మీటర్ల దూరంలో నక్సల్స్ దాచిన తుపాకులు, మందుపాతర్ల‌ను భద్రతా బలగాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి.