17-04-2025 01:10:05 AM
చేగుంట, ఏప్రిల్ 16 : చేగుంట మండలం వడియారం గ్రామ సీనియర్ నాయకుడు అంకన్నగారి వెంకట్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, చేగుంట వడియారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. సీనియర్ నాయకుడు అంకన్నగారి వెంకట్ గౌడ్ ను దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకట్ గౌడ్ తో పాటు సుమారు 100 మంది మహిళలు, పురుషులు పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, మండల కోఆర్డినేటర్ జనగామ మల్లారెడ్డి,ఉపాధ్యక్షుడు మసాయి పెట్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, ఓబీసీ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు, ఎస్సి సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సిములు, ఎస్టీ సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్, దుబ్బాక యూత్ అధ్యక్షులు సయ్యద్ ఉస్సాముద్దీన్, మండల యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్,కాంగ్రెస్ నాయకులు సండ్రుగు శ్రీకాంత్,నదీమ్,పరంజ్యోతి,వెంగళ్ రావు,రాజా గౌడ్,నలిన్ గౌడ్ తో పాటు ముఖ్య కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.